– నేడు ఖమ్మం మహా ధర్నాను జయప్రదం చేయండి
– సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు
నవతెలంగాణ-సత్తుపల్లి : నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేడు (గురువారం) ఖమ్మంలో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని ఆ పార్టీ పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు కోరారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి వెంటనే భర్తీ చేయాలని సర్వేశ్వరరావు డిమాండ్ చేశారు. నోటిఫికేషన్లు క్రమం తప్పకుండా విడుదల చేసి, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత ఆవేదనను ప్రభుత్వం గుర్తించాలన్నారు. సత్తుపల్లి ప్రాంత నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో ఖమ్మం ధర్నాలో పాల్గొనాలని కోరారు. యువత ఏకమై తమ హక్కుల కోసం ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వం స్పందించి ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన ప్రకటన చేసే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. నిరుద్యోగులంతా కలిసికట్టుగా హాజరై ఈ మహాధర్నాను ఘనంగా విజయవంతం చేయాలని సర్వేశ్వరరావు కోరారు.
నిరుద్యోగ సమస్యలను పరిష్కరించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



