Sunday, April 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు

దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు

- Advertisement -

• సర్పంచ్ తోటకూరి శ్రీనివాస్ 
నవతెలంగాణ- పెద్దవంగర 
వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ తోటకూరి శ్రీనివాస్ అన్నారు. మండలంలోని అవుతాపురం గ్రామంలో బాలవికాద స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బాల వికాస కోఆర్డినేటర్ జె. శైలజ తో కలిసి మాట్లాడారు. వేసవి కాలంలో ప్రయాణికులు, కూలీలు, వృద్ధులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. అలాంటి సమయంలో చల్లని తాగునీరు అందించడం ఎంతో అభినందనీయం అని కొనియాడారు. బాల వికాస సంస్థ చేపట్టిన ఇలాంటి కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకుని గ్రామాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బాల వికాస ప్రతినిధి శోభారాణి, నాయకులు వెంకటేశ్వర్లు పూలమ్మ, రవి, రేణుక, యాకన్న, సులోచన దేవి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -