Sunday, April 5, 2026
E-PAPER
Homeజాతీయంఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బెంగళూరు నుంచి ఢిల్లీ బయల్దేరాల్సిన ఇండిగో విమానంలో శనివారం సాయంత్రం బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. విమానం టేకాఫ్ కానున్న సమయంలో వాష్‌రూమ్‌లో టిష్యూ పేపర్‌పై బాంబు బెదిరింపు నోట్ కనిపించింది. దీంతో ప్రయాణికులను దింపివేసి, విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి బాంబు లేదని తేలడంతో, ప్రయాణికులను తిరిగి విమానంలోకి ఎక్కించి ఢిల్లీకి పంపించారు. ఈ బెదిరింపు నోట్‌పై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇటీవల ఇలాంటి అనవసర బెదిరింపులకు పాల్పడిన మైసూరుకు చెందిన ఒక వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -