Monday, April 6, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంగల్లంతైన అమెరికన్ పైలట్ ను కాపాడిన భద్రతా దళాలు

గల్లంతైన అమెరికన్ పైలట్ ను కాపాడిన భద్రతా దళాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఇరాన్ గగనతలంలో కూలిపోయిన ఎఫ్-15ఈ (F-15E) యుద్ధ విమానానికి సంబంధించి గత 36 గంటలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. గల్లంతైన అమెరికన్ పైలట్ ఆచూకీ లభించడమే కాకుండా, అమెరికా భద్రతా దళాలు అతడిని రక్షించాయి. శుక్రవారం ఇరాన్ దళాలు జరిపిన దాడిలో అమెరికాకు చెందిన ఫైటర్ జెట్ కూలిపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విమానంలోని ఇద్దరు సిబ్బంది ఎజెక్ట్ అయ్యారు. ఒకరిని వెంటనే రక్షించినప్పటికీ, రెండో పైలట్ ఆచూకీ లభించలేదు. శత్రువుల కళ్లు గప్పి ఇరాన్ పర్వత ప్రాంతాల్లో దాక్కున్న ఆ పైలట్ కోసం అమెరికా సైన్యం డ్రోన్లు, హెలికాప్టర్లతో భారీ గాలింపు చేపట్టింది.

మరోవైపు ఇరాన్ కూడా సదరు పైలట్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించింది. అయితే, ఇరాన్ సేనల కంటే ముందే అమెరికా స్పెషల్ ఫోర్స్ కమెండోలు పైలట్ ఉన్న ప్రాంతాన్ని గుర్తించి అతడిని రక్షించాయి. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతోషం వ్యక్తం చేస్తూ, ఇది అమెరికా సైనిక చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ అని కొనియాడారు. ప్రస్తుతం ఆ పైలట్ సురక్షితంగా ఉన్నారని, స్వల్ప గాయాల నుంచి కోలుకుంటున్నారని అధికారులు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -