Monday, April 6, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంహ‌ర్మూజ్‌ను తెర‌వండి: డొనాల్డ్ ట్రంప్

హ‌ర్మూజ్‌ను తెర‌వండి: డొనాల్డ్ ట్రంప్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: తాను ఎంతగా హెచ్చరించినా హార్ముజ్ జలసంధిని ఇరాన్ తెరవకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆవేశానికి లోనయ్యారు. ఈ సందర్భంగా తన సోషల్ మీడియా అకౌంట్ ట్రూత్ వేదికగా ఇరాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. హార్ముజ్‌ జలసంధిని తెరవకుంటే ఇరాన్‌పై భీకర దాడులు తప్పవని హెచ్చరించారు.

మరోవైపు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు దాడులు కొనసాగిస్తున్నాయి. ఇరాన్ కూడా కువైట్, బహ్రెయిన్‌లోని చమురు కేంద్రాలపై దాడులు చేస్తోంది. ఇంకోవైపు ఇజ్రాయెల్ దళాలు లెబనాన్ రాజధాని అయిన బీరుట్‌పై దాడులు చేస్తున్నాయి. అలాగే, ఆదివారం అమెరికాకు చెందిన యుద్ధ విమానాల్ని కూల్చివేశామని ఇరాన్ తెలిపింది. సీ-130 అనే రెండు రవాణా విమానాల్ని, రెండు బ్లాక్ హ్యాక్ అనే హెలికాప్టర్లను కూల్చినట్లు తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -