నవతెలంగాణ-హైదరాబాద్: 251 పరుగుల భారీ చేధనలో సీఎస్కే తడబడుతోంది. 30 రన్స్ కే మూడు వికెట్లు కోల్పోయింది. రుతుజాజ్, సంజు, ఆయుష్ సింగిల్ డిజిట్ పరుగులకే పెవిలియన్ చేరారు. ఢపీ రెండు వికెట్లు, భువనేశ్వర్ ఒక వికెట్ తీశాడు. మూడు ఓవర్లు ముగిసేరికి సీఎస్క్ స్కోర్:30-3. ప్రస్తుతం క్రీజులో కార్తీక్(6), సర్ఫరాజ్(37)
చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లగాను 3 వికెట్లు కోల్పోయి 250 పరుగుల కొండంత లక్ష్యాన్ని సీఎస్కే ముందుంచింది. ఆర్సీబీ బ్యాటర్లు సాల్డ్(46), కోహ్లీ(28), డేవిడ్(70), పాటీదార్(48), పడిక్కల్ అర్ధ సెంచరీతో చెలరేగాడు.
క్రీజులోకి వచ్చి రాగానే కెప్టెన్ పాటిదర్ ధనాధన్ బ్యాటింగ్‌తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. స్టేడియం నలుమూలాల సిక్స్, ఫోర్లలతో ఎడాపెడా బాదుతూ సీఎస్క్ బౌలర్లను ఆడుకున్నాడు. 18 బంతుల్లో(ఒక ఫోర్, 6 సిక్స్‌లు) 48 రన్స్ చేశాడు. మరో ఎండ్‌లో డేవిడ్ కూడా విజృంబించాడు. 20 బంతుల్లో(2 ఫోర్లు, 6 సిక్స్‌లు) 56 పరుగులు చేశాడు. అయితే మంచి ఊపులో ఉన్న డేవిడ్‌ను 17 ఓవర్లో కాంబోజ్ ఔట్ చేసినా.. నో బాల్ కావడంతో సీఎస్క్‌ను దురదృష్టం వెంటాడింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగించుకున్న డేవిడ్ తన బ్యాటింగ్‌కు మరింత పదును పెట్టాడు. ప్రతి ఓవర్లో సిక్స్, ఫోర్లలతో స్ట్రేడియంలో పరుగుల వరద పారించారు. ఇరువురి భీకర ఆటతో కేవలం కేవలం 37 బంతుల్లో 99 పరుగులు పిండుకున్నారు. దీంతో ఆర్సీబీ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్లింది. 250 పరుగుల కొండంత లక్ష్యాన్ని సీఎస్కే ముందుంచింది. సీఎస్క్ బౌలర్లు కాంబోజ్, ఓర్టాన్ శివం దూబే తలా ఒక వికెట్ తీశారు.


