- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇరాన్‌పై మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. యుద్ధ విరమణ కోసం ఇచ్చిన 10 రోజుల గడువు ముగిసినా ఇరాన్ స్పందించలేదని, అందుకే 48 గంటల తర్వాత ప్రపంచం ఎన్నడూ చూడని బీభత్సం సృష్టిస్తానని హెచ్చరించారు. మంగళవారం ఇరాన్ విద్యుత్ కర్మాగారాలు, పరిశ్రమలు వంటి వెన్నెముక వంటి వాటిని నాశనం చేస్తానని, 50 వేల మంది అమెరికన్ సాయుధ దళాలను పంపిస్తున్నట్లు ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. అధునాతన యుద్ధ విమానాలు కూడా సిద్ధంగా ఉన్నాయని, ఇరాన్‌లో బీభత్సం సృష్టించబోతున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
- Advertisement -



