Friday, August 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఐటీయూ పోరాటాల ఫలితంగా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

సీఐటీయూ పోరాటాల ఫలితంగా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

- Advertisement -

సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎం.శంకర్ నాయక్
నవతెలంగాణ-అచ్చంపేట
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఐటీయూ పోరాటాల ఫలితంగానే మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగులకు వారాంతపు సెలవుల జీవో విడుదలైందని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎం శంకర్ నాయక్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ కమిషనర్ మురళికు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి జీవో సర్కులర్ ను అమలు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో చేసిన పోరాటాల ఫలితంగానే కార్మికులకు వారాంతపు సెలవులు, పండుగ సెలవులు, క్యాజువల్ సెలవులు, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు విడుదలయ్యాయని తెలిపారు. ఇది సీఐటీయూ పోరాటల ఫలితమే చెప్పారు.

ఎన్నో ఏండ్లుగా కార్మికులు తమ రెక్కలను ముక్కలు చేసుకుని పట్టణ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచే మున్సిపల్ కార్మికులకు సెలవులు లేక, పండుగలు లేకుండా శుభకార్యాలు లేకుండా.. నిత్యం పనిలో నిమగ్నమై కార్మికులకు సీఐటీయూ ఫలితంగా భారీ ఉపశమనం లభించిందన్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే ప్రభుత్వం ఇచ్చిన సర్కులర్ జీవోను వెంటనే అమలు చేసి కార్మికులకు సెలవుల సర్కులర్లను అమలు చేయాలని, అదేవిధంగా కార్మికులకు ఇవ్వాల్సిన ఈఎస్ఐ పిఎఫ్, పెండింగ్లో ఉన్న ఏరియర్స్ వెంటనే చెల్లించాలని  ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు సైదులు మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు తిరుపతయ్య దామోదర్ ప్రవీణ్ లక్ష్మయ్య బాలమ్మ వెంకటమ్మ అలివేల సుభద్ర మున్సిపల్ కార్మికులు అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -