- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలోని లక్షలాది మంది గిగ్ వర్కర్ల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మే 1 నుండి గిగ్ వర్కర్ల చట్టం అమలులోకి వస్తుందని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకం ద్వారా రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం గిగ్ వర్కర్లకు కూడా వర్తిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ చట్టం ద్వారా ఏర్పాటు చేసే బోర్డులో ప్రభుత్వంతో పాటు గిగ్ వర్కర్ల యూనియన్ సభ్యులు కూడా ఉంటారని, అగ్రిగేటర్ల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేస్తూ, వారి నుంచి వసూలు చేసే ‘సెస్’ నిధులను కార్మికుల ఆరోగ్య, సామాజిక భద్రతకు వినియోగిస్తామని వివరించారు.
- Advertisement -



