Friday, August 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు  

భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు  

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌన్
శ్రావణ మాసంలో మొదటి శుక్రవారంతో పాటు వరలక్ష‍్మీ వ్రతాన్ని పురస్కరించుకొని ఆలేరు పట్టణంలో మహిళా భక్తులతో ఆలయాల కిక్కిరిసిపోయాయి. పట్టణంలోని శ్రీ కనకదుర్గ ఆలయం, సంతోషిమాత ఆలయం, శ్రీ చాముండేశ్వరి శివాలయంలో, శ్రీ లక్ష్మీదేవి గోదాదేవి సాయిత రంగనాయక ఆలయాలలో భక్తులు సామూహికంగా కుంకుమార్చనలు చేశారు. గోత్రనామాలతో అర్చనల అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు ఆలయ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్లు అర్చకులు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -