నవతెలంగాణ-ఆలేరు టౌను
పెన్షనర్లు ఎదుర్కొన్న సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని, టిఏపిఆర్ పి ఏ అధ్యక్ష, కార్యదర్శులు బొమ్మ కంటి బాలరాజు కడారి రమేష్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ హెచ్ఎస్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న పెన్షనర్స్, గత మూడు నెలల నుండి అనారోగ్యాలతో బాధపడుతూ, కార్డుల కోసం ఎదురుచూస్తున్నరాని పేర్కొన్నారు.
పెన్షనర్స్ తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారని, మూడు నెలల నుండి పెన్షన్ లో 1.5% డబ్బులు మినహాయిస్తూ ఇంతవరకు కార్డులు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం బాధపడుతున్న పిన్షనర్లకు, అనారోగ్యాలతో ఎదురుచూస్తున్న విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం వెంటనే కార్డులు మంజూరు చేసి, నెట్ సెంటర్ల లో డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని కోరారు. విశ్రాంత ఉద్యోగులకు ఆరోగ్య రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని గుర్తు చేశారు.



