– పాత పైపులు తొలగించి నూతన పైపులైను ఏర్పాటు చేయాలి
– పాత పైప్ లైన్ లోపల ఉన్న పొడుగాటి ఏర్లు తాడు
– ఆరవ వార్డు సభ్యుడు నల్లని పాపారావు
నవతెలంగాణ – నెల్లికుదురు : మండలంలోని మనీ గల వీడు గ్రామంలోని ఆరవ వార్డులో ఉన్న పైప్ లైన్ లో పీచు ఉండటంవల్ల మీరు పూర్తిస్థాయిలో రాక ఆ వార్డు సభ్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే నూతన పైప్ లైన్ ఏర్పాటు చేయాలని ఆ వార్డు సభ్యుడు నల్లని పాపారావు డిమాండ్ చేసినట్టు తెలిపారు. సోమవారం నీరు రాకపోవడంతో పైపులైను తీసి చూడడంతో ఆ పైపులు పీచు పొడవునా దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునీగలవీడు గ్రామంలో త్రాగు నీరు పైపు లైన్లు గత 30 సంవత్సరాలల క్రితం వేశారని చాలా రోజులవడంతో ఆ పైపులైన్ లోకి వివిధ రకాల చెట్లు సంబంధించిన ఏర్లు పైపుల్లోకి వెళ్లి ఒక తాడు రూపంగా మారి సిమెంటు పైపులోకి పోయి నీళ్లు రాకుండ జమ అయిందని అన్నారు. అందుకోసం సిమెంట్ పైపు లైన్ స్థానంలో కొత్తగా ప్లాస్టిక్ పైపులు వేసిన పురాతన పైపులను తొలగించి కొత్త పైపులు మంజూరు చేయాలని గ్రామస్తులు ఆవేదన ఆవేదన వ్యక్తం చెబుతున్నారని తెలిపారు. గ్రామంలో ఇంటి పక్కన ఉండబడిన చెట్లు వాటి యొక్క వేర్లు పైపులైన్లు జొరబడి నీరు సరఫరాకు అంతరాయం కలగజేస్తున్న ప్రతి గల్లీ కూడా ఇదే అంతరాయం ఏర్పడుతున్నది పురాతన పైపులైన్ కావున వాటి తీసేసి కొత్త పైపులైన్ మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ప్రజాప్రతినిధులను కోరుతున్నట్లు తెలిపారు.
పాత పైపుల లీకేజీ వల్ల నీటికి ఇబ్బంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



