– సత్తుపల్లిలో ఆటోనగర్ ఏర్పాటుకు కృషి చేస్తాం
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లిలోని చేయూత మోటారు ఆటో మెకానిక్ వర్కర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎం. ఏడుకొండలు, ఉపాధ్యక్షులుగా ఎస్.కె. నజీముద్దీన్, సుభాని, ప్రధాన కార్యదర్శిగా శంకరాచారి ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా టి. సురేష్, క్రాంతి కుమార్, గణేష్, రహ్మతుల్లా, మహ్మద్ రఫీ, కార్యవర్గ సభ్యులుగా ఎస్.కె. ఉస్మాన్, షరీఫ్, సుభాని, వీరభద్రరావు, జె. అబీబుల్లాను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఏడుకొండలు మాట్లాడుతూ…. మెకానిక్ వర్కర్ల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.
మెకానిక్ వర్కర్ల కోసం ఆటోనగర్ ఏర్పాటు చేయాలి
మెకానిక్ వర్కర్ల కోసం సత్తుపల్లిలో ప్రత్యేకంగా ఆటోనగర్ ఏర్పాటు చేయాలని నూతన కార్యవర్గ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. కోరారు. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఎమ్మెల్యే మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, తహసీల్దార్ పున్నం సత్యనారాయణకు వినతిపత్రాలు అందజేశారు.
దీనిపై స్పందించిన మంత్రి పొంగులేటి, ఆటోనగర్ ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ను ఆదేశించారు. అనంతరం కలెక్టర్, తహసీల్దార్‌తో కలిసి ఆటోనగర్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలించారు. మెకానిక్ వర్కర్ల సమస్యను పరిష్కరిస్తామని తహసీల్దార్ సత్యనారాయణ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తమ వినతిపై సానుకూలంగా స్పందించిన మంత్రి, కలెక్టర్, ఎమ్మెల్యే, రెవెన్యూ అధికారులకు అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.



