Monday, April 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వ్యక్తిత్వ వికాసానికి ‘చరిత్ర’ దోహ‌దం: డా.ఎస్.కిశోర్

వ్యక్తిత్వ వికాసానికి ‘చరిత్ర’ దోహ‌దం: డా.ఎస్.కిశోర్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమ‌వారం నిర్వహించిన అతిథి ఉపన్యాస కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథి ఉపన్యాసకుడిగా పాల్గొన్న డా.ఎస్.కిశోర్ “తెలంగాణ చరిత్ర-సంస్కృతి” అనే అంశంపై విస్తృతంగా ప్రసంగించారు.తెలంగాణ చరిత్రలోని ముఖ్య ఘట్టాలు, సాంస్కృతిక సంపద, సంప్రదాయాలు, జానపద కళలు మరియు ఉద్యమాల ప్రాముఖ్యతను వివరించారు. తెలంగాణ భాషా వైశిష్ట్యం, పండుగల ప్రాధాన్యం, ప్రజల జీవన విధానం వంటి అంశాలను స్పష్టంగా వివరించడం విద్యార్థులను ఆకట్టుకుంది. తమ ప్రాంత చరిత్రను తెలుసుకోవడం ద్వారా వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని ఆయన సూచించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బంగ్లా భారతి మాట్లాడుతూ.. ఇటువంటి ఉపన్యాసాలు విద్యార్థుల విజ్ఞానాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. చరిత్ర విభాగ ఉపన్యాసకురాలు మంజుల చరిత్ర అధ్యయనం ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -