Monday, April 6, 2026
E-PAPER
Homeజాతీయంహిమ‌చ‌ల్‌ప్ర‌దేశ్‌లో ట్రాన్స్‌ఫోర్ట్ సంఘాలు భారీ ఆందోళ‌న‌

హిమ‌చ‌ల్‌ప్ర‌దేశ్‌లో ట్రాన్స్‌ఫోర్ట్ సంఘాలు భారీ ఆందోళ‌న‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: హిమ‌చ‌ల్ ప్ర‌దేశ్‌లో ర‌వాణా యూనియ‌న్ సంఘాలు భారీ ర్యాలీతో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టాయి. ఆటోమెటెడ్ టెస్టింగ్ స్ట్రేష‌న్ల‌ను(ATS) రాష్ట్రంలో సుదూరు ప్రాంతంలో ఏర్పాటు చేయ‌డాన్ని వ్యతిరేకిస్తూ ధ‌ర్మ‌శాల రోడ్ల మీద బైటాయించారు. వంద‌ల సంఖ్య‌లో పాల్గొన్న‌ నిర‌స‌న‌కారులు అన్ని వైపులా ర‌వాదారుల‌ను బ్లాక్ చేశారు. ఆ రాష్ట్రంలోని ట్రాన్స్‌పోర్టు యూనియ‌న్స్, ప్ర‌యివేట్ ట్రావెల్స్, టాక్సి యూనియ‌న్స్ అనేక సంఘాలు ఈ ధ‌ర్నాలో పాలుపంచుకున్నాయి. ఏటీఎస్‌ల‌ను జిల్లాకు ఒక్క సెంట‌ర్‌నే ఏర్పాటు చేశార‌ని, అది కూడా వంద‌ల కిలోమీట‌ర్ల దూరంలో ఉన్నాయ‌ని ఆందోళ‌న‌కారులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏటీఎస్‌ల కోసం వంద‌ల కిలోమీట‌ర్లు ప్ర‌యాణించాల్సి వ‌స్తోంద‌ని, స‌మ‌యం వృథాతో పాటు త‌మ పై అద‌నంగా ఆర్థిక భారం ప‌డుతుంద‌ని అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

ఎటిఎస్ కేంద్రాలు అధికంగా వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. “మాకు రూ. 100 ఇచ్చే ఏల్లో కార్డు, ఏటీఎస్ సెంటర్లలో రూ. 500 వసూలు చేస్తున్నారు. అదేవిధంగా అగ్నిమాపక యంత్రాలు, ప్రథమ చికిత్స కిట్‌లకు కూడా అధికంగా వసూలు చేస్తున్నారు. అందుకే సమ్మె చేస్తున్నాం, ఈ రోజు వాణిజ్య వాహనాలను నిలిపివేస్తున్నాం. ఇది ఒక రోజు సమ్మె, కానీ వారు మా మాట వినకపోతే మేము స‌మ్మెను కొన‌సాగిస్తాం’ అని ట్రాన్స్‌ఫోర్ట్ యూనియ‌న్స్ హెచ్చ‌రించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -