Monday, April 6, 2026
E-PAPER
Homeజిల్లాలుఆరోగ్య వారంపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశం

ఆరోగ్య వారంపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశం

- Advertisement -

నవతెలంగాణ-కంఠేశ్వర్: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ ఆరవ తేదీ నుండి ఏప్రిల్ 11వ తేదీ వరకు ఆరోగ్య వారం నిర్వహించ‌నున్నార‌ని, ఈ ఆరోగ్య వారాన్ని పురస్కరించుకొని జిల్లా స్థాయి సమన్వయ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి ఆదేశాల మేరకు అడిషనల్ కలెక్టర్ దిలీప్ కుమార్ అధ్యక్షతన వారి చాంబర్లో నిర్వహించడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ తెలియజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఆరోగ్య వారంలో అన్ని ఆరోగ్య దినోత్సవాలను జిల్లా అధికారుల సమన్వయoతో విజయవంతం చేయాలన్నారు.

ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ రాజశ్రీ మాట్లాడుతూ.. ఏప్రిల్ ఆరవ తేదీ మొదటి రోజు ఈరోజుఫుడ్ సేఫ్టీ డే నీ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆహార భద్రతపై అవగాహన మరియు ర్యాలీ మరియు ఉద్యోగులకు జీవన శైలి వ్యాధులపై నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు.రెండవ రోజు అయిన ఏప్రిల్ ఏడవ తారీఖున ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దుబ్బా పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద అవగాహన ర్యాలీ మరియు ఐ డి ఓ సి రూమ్ నంబర్ 201 నందు అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు. మూడవరోజు ఏప్రిల్ 8వ తేదీన సేఫ్ మదర్ రోజును నిర్వహించడం జరుగుతుందని ఆరోజు జిల్లా స్థాయి లో గర్భిణీ స్త్రీలు బాలింతలకు వర్క్ షాప్ నిర్వహించడం జరుగుతుందన్నారు. మాతా శిశు మరణాలను తగ్గించడంపై అవగాహన కలిగించడం జరుగుతుంది అన్నారు. నాలుగవ రోజు ఏప్రిల్ 9వ తేదీన హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ మరియు నిర్ధారణ పరీక్షలను కేంద్రకారాగారంలోని ఖైదీలకు మరియు ట్రాన్స్ జెండర్ లకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఐదవ రోజు ఏప్రిల్ 10వ తేదీన హోమియోపతి మరియు ఆయుర్వేద దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆరోజు కోటగల్లి పద్మశాలి సంఘం నందు యోగ పై అవగాహన మరియు హోమియోపతి మెడికల్ షాంపు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆరవ రోజు ఏప్రిల్ 11వ తేదీన డ్రగ్స్ కంట్రోల్ మరియు రెగ్యులేటరీ స్ట్రెన్తెనింగ్ రోజుగా నిర్వహించడం జరుగుతుందని డ్రగ్స్ క్వాలిటీ ,అవైలబిలిటీ మరియు రెగ్యులేటరీ కంప్లైంట్స్ ఆఫ్ మెడిసిన్స్ పై అవగాహన ఉంటుందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -