- Advertisement -
నవతెలంగాణ-తుర్కపల్లి: ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందని సర్పంచ్ బొత్త రాములు అన్నారు. సోమవారం తుర్కపల్లి మండలం ఇంద్రనగర్ గ్రామాల్లో ఎంపీపీ ఎస్ పాఠశాలను సందర్శించారు.ఈ ఇంద్రనగర్ సర్పంచ్ లక్ష్మి రామచంద్రంతో కలిసి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఐదవ తరగతి విద్యార్థులని గంధ మల్ల జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు పంపించాలని బడిబాట కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. పిల్లల కోసం కాలినడకన కాకుండా ఆటో సదుపాయాన్ని కల్పిస్తామని బొత్త రాములు హామీ ఇచ్చినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు లక్కు సుజాత, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.
- Advertisement -



