Tuesday, April 7, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ప్రమాదవశత్తు  మొక్కజొన్న పంట దగ్ధం

ప్రమాదవశత్తు  మొక్కజొన్న పంట దగ్ధం

- Advertisement -

నవతెలంగాణ కుభీర్ : మండలంలోని మాలేగాం గ్రామంలో సోమవారం ప్రమాదవశత్తు  మొక్క జొన్న పంట పూర్తిగా కాలి బూడిద కావడం జరిగింది. రైతు తెలపిన వివరాల ప్రకారం కుభీర్ మండలంలోని మలేగాం గ్రామానికి చెందిన గౌతమ్, భోజరం అనే ఇద్దరి రైతులకు సంబదించిన ఐదు ఎకరాల మొక్క జొన్న పంటను సాగుచేశారు. దింతో పంట చేతికి వచ్చి కోత కోసి అరబెట్టగా సోమవారం మధ్యాహ్నం సమయంలో  ప్రమాదవశత్తు  ఒక్కసారిగా మంటలు  చిలరేగి  మొక్కజొన్న పంటకు  తగిలింది. దీంతో ఎంతో కష్టపడి పంటలు సాగు చేసి  చేతికి వచ్చిన సమయంలో కళ్ళముందే  కాలి బూడిద కావడం చూసి  రైతు కన్నీరు మున్నీరయ్యారు. దీంతో రైతు దాదాపుగా 3 లక్షల వరకు నష్టపోయినట్లు తెలిపారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించేలా చూడాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -