నవతెలంగాణ-హైదరాబాద్: ఏపీలోని విజయనగరంలో బంగారానికి ఆశపడి సొంత బంధువులే ఓ వృద్ధురాలిని చంపి చెరువులో పాతిపెట్టిన ఘటన పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. మంగళవారం స్థానిక వివరాల మేరకు … చీపురుపల్లి మండలం గొల్లపాలెం గ్రామంలో గొర్లె చిన్నప్పమ్మ (65) ను అదే గ్రామానికి చెందిన ఆమె మేనల్లుడు వరుసైన ఎజ్జుపొరపు రమణ, చందక రమణ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి ఆమె బంగారానికి ఆశపడి చంపేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన వఅద్ధురాలిని గొల్లపాలెం గ్రామానికి సమీపంలో గల ఒక చెరువులో పాతిపెట్టారు. దీంతో మృతురాలి అల్లుడు రెడ్డి పాపునాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసును ఛేదించారు. ఈ క్రమంలో స్థానిక పోలీసులతోపాటు విజయనగరం, విశాఖపట్నం నుండి ఆర్ ఎఫ్ ఎస్ ఎల్ టీంలు, క్లూస్ టీంలు డి.ఎస్.పి ఎస్ రాఘవులు, సీఐ శంకర్రావుల ఆధ్వర్యంలో సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ తవ్విచూడగా వృద్ధురాలి మృతదేహం కనిపించింది. ఈ సంఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
బంగారం కోసం వృద్ధురాలి హత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



