- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్ కొత్త సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ తీవ్ర ఆనారోగ్యం పాలయ్యారు. ఆయన అపస్మారక స్థితిలోకి పోవడంతో ఇరాన్‌లోని ఖోమ్ నగరంలో ఓ ఆసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. ఇంటెలిజెన్స్ అంచనా ప్రకారం ఈ విషయాన్ని మంగళవారం లండన్ మీడియా ది టైమ్స్ యుకే నివేదించింది.
కాగా, సుప్రీం నేత ఖమేనీ అపస్మారక స్థితిలో ఉన్నారని, తీవ్రమైన అనారోగ్యానికి చికిత్స పొందుతున్నారని అమెరికా- ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ తన మిత్ర దేశాలకు సమాచారం అందించిందని యుకె మీడియా వెల్లడించింది. సర్వోన్నత నేత ఆచూకీని తొలిసారి వెల్లడించిన ఆ మెమోను తాము చూశామని టైమ్స్ పత్రిక వెల్లడించింది.
- Advertisement -



