నవతెలంగాణ-హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డేవిడ్ వార్నర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.సిడ్నీలో మద్యం మత్తులో కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. ఏప్రిల్ 5వ తేదీన రాత్రి సిడ్నీలోని మరౌబ్రా (Maroubra) ప్రాంతంలో న్యూ సౌత్ వేల్స్ (NSW) పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో వార్నర్ పట్టుబడ్డారు. చెకింగ్ పాయింట్ సమీపంలోనే వార్నర్ తన వ్యాన్‌ను ఆపి పక్కకు పార్క్ చేయడాన్ని గమనించిన పోలీసులు, అతడి వద్దకు వెళ్లి బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించారు. ఈ టెస్టులో వార్నర్ శరీరంలో ఆల్కహాల్ శాతం 0.104 గా నమోదైంది. ఇది చట్టబద్ధమైన పరిమితి (0.05) కంటే రెండింతలు ఎక్కువగా ఉంది. దీంతో పోలీసులు వార్నర్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం అతడ్ని విడుదల చేస్తూ.. 2026, మే 7వ తేదీన సిడ్నీలోని డౌనింగ్ సెంటర్ లోకల్ కోర్టులో హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.
డేవిడ్ వార్నర్ అరెస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



