నవతెలంగాణ – జుక్కల్
1వ ఐయూవైఎఫ్( IUYF )యోగా ప్రపంచ ఛాంపియన్‌షిప్ మరియు సాంస్కృతిక ఉత్సవం 2026 సర్టిఫికేట్ యోగా ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫెస్టివల్ జుక్కల్ మండల వాసి అయిన గొల్ల అకిరాకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో స్థిరపడింది. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో ప్రశంసనీయ స్థానాన్ని పొందింది. దీన్ని గుర్తించిన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ప్రశంస పత్రాన్ని అందించారు. ఐయూవైఎఫ్ యూనియన్ అంతర్జాతీయ యోగా సమాఖ్య వెబ్ స్పోర్ట్స్, ఆర్ట్ సైన్స్ మరియు మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వారి ఒక విభాగం ఒకటవ జుయ్ఫ్ యోగ ప్రపంచ ఛాంపియన్ షిప్ సాంస్కృతిక ఉత్సవం 2026 సర్టిఫికెట్ అందించారని ఛాంపియన్షిప్ గా గెలిచిన గొల్ల అకిరా తండ్రి గొల్ల శ్రీనివాస్ తెలిపారు. యోగ గురువుగా గాయత్రి సారత్యం నిర్వహించారు. పాప నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని విశ్వ వికాస్ స్కూల్ యాజమాన్యం ప్రోత్సహించడం జరిగిందని అన్నారు. భారతదేశంలోని బెంగళూరులోని శ్రీ శారదా ఇంటర్నేషనల్ స్కూల్‌లో 2026 ఫిబ్రవరి 6, 7 & 8 తేదీలలో నిర్వహించిన 1 ఐయూవైఎఫ్ (IUYF) యోగా ప్రపంచ ఛాంపియన్‌షిప్ 2026లో ప్రశంసనీయమైన స్థానాన్ని సాధించింది.
గొల్ల అకీర, నిజామాబాద్ లో విశ్వవికాస్ స్కూల్ 4 వ తరగతి చదువుతూ యోగలో ఆసక్తి తో స్కూల్ యాజమాన్యం యోగ ట్రైనర్ గాయత్రి మేడమ్ ఆధ్వర్యంలో నేటికీ ఉత్తమ శిక్షణ పొందుతున్నారు. సబ్ జూనియర్ గర్ల్ అండర్ 10 ఇయర్స్ కేటగిరీలో పాల్గొన్నవారి సాధన మరియు అంకితభావానికి గుర్తింపుగా ప్రపంచం స్థానంలో వెండి మెడల్ సాధించిన అకిర కి జుక్కల్ గ్రామస్తుల అభినందనలు తెలియజేశారు.
నవతెలంగాణ–ఆమనగల్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని మైసిగండి మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, టీపీసీసీ సభ్యులు అయిళ్ళ శ్రీనివాస్ గౌడ్, ఏఎంసీ చైర్ పర్సన్ యాట గీత నర్సింహ ముదిరాజ్, జడ్పీ మాజీ
చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, స్థానిక సర్పంచ్ ప్రేమ జవాహర్ లాల్ నాయక్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలు సంధ్యా రెడ్డి తదితరులతో కలిసి ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మహేష్ కుమార్ గౌడ్ ను పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆలయ మర్యాదలతో సన్మానించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈకార్యక్రమంలో ఆలయ ట్రస్టీ శిరోలి పంతునాయక్, ఈఓ స్నేహలత, తహసీల్దార్ జ్యోతి అరుణ్, భాస్కర్, డీసీసీ ఉపాధ్యక్షులు శ్రీపాతి శ్రీనివాస్ రెడ్డి, అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బిక్యా నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ ముదిరాజ్, ఏఎంసీ వైస్ చైర్మెన్ గూడూరు భాస్కర్ రెడ్డి, ఉపసర్పంచ్లు హీరా సింగ్ నాయక్, యాదగిరి రెడ్డి, లక్పతి నాయక్, మాజీ వైస్ చైర్మెన్ గుర్రం కేశవులు, ఏఎంసీ డైరెక్టర్లు, నాయకులు ప్రభాకర్ రెడ్డి, బిచ్యా నాయక్, చేగూరి వెంకటేష్, పోతుగంటి అశోక్, జహాంగీర్ బాబా తదితరులు పాల్గొన్నారు.



