Tuesday, April 7, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఈ రాత్రికే ఇరాన్ నాగ‌రిత‌క అంతం: అమెరికా అధ్యక్షుడు

ఈ రాత్రికే ఇరాన్ నాగ‌రిత‌క అంతం: అమెరికా అధ్యక్షుడు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఈ రాత్రికే ఇరాన్ నాగరికత అంతం చేస్తామ‌ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధిక ప్రేలాప‌న‌లు చేశారు. యుద్ధంలో ఈ రాత్రి అత్యంత కీలకమైనదిగా ట్రంప్ పేర్కొన్నారు. ఈ రాత్రి ఒక నాగరికత పూర్తిగా నాశనమవుతుందని తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. 47 ఏళ్ల అణచివేత, అవినీతి, మరణాలకు ఎట్టకేలకు ముగింపు పలుకుతామని ట్రంప్ ప్రకటించారు.

‘‘ఈ రాత్రి ఒక నాగరికత మొత్తం అంతమైపోతుంది.. దాన్ని ఇక ఎప్పటికీ పునరుద్ధరించలేరు. అలా జరగాలని నేను కోరుకోవడం లేదు. కానీ బహుశా అది జరిగి తీరుతుంది.’’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ పోస్ట్‌లో రాశారు.

అయితే హార్ముజ్ జలసంధిని తెరవాలని ట్రంప్ డెడ్‌లైన్ విధించారు. ఒప్పందం చేసుకోకపోతే 48 గంటల్లో ఇరాన్‌ను సర్వ నాశనం చేస్తామని ట్రంప్ బెదిరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -