Tuesday, April 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పలు గ్రామాలలో సుడిగాలి పర్యటన చేసిన జెడ్పి సీఈవో

పలు గ్రామాలలో సుడిగాలి పర్యటన చేసిన జెడ్పి సీఈవో

- Advertisement -

నవతెలంగాణ- జుక్కల్  : మండలంలోని పలు గ్రామాలలో కామారెడ్డి జిల్లా జడ్పీ సీఈఓ చందర్ నాయక్ సుడిగాలి పర్యటన చేశారని జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని పెద్ద ఏడ్గి, పెద్దగుల్లా జిపి గ్రామాలను జెడ్పి సీఈవో మండల పరిషత్ అధికారులు ,  ఉపాధి హామీ సిబ్బంది , తో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించారు. మొదటగా పెద్ద ఏడ్గి జిపిలో స్థానిక సర్పంచ్ అస్పత్ వార్ అనిల్ కుమార్ తో కలిసి గ్రామంలోని నర్సరీని పరిశీలించారు. అనంతరం ఉపాధి హామీ పనులు జరుగుతున్న క్షేత్రస్థాయిలోకి వెళ్లి పనులను పరిశీలించారు. ఉపాధికూలీలతో మాట్లాడుతు ఉదయం చల్లటి సమయంలోనే పనులకు రావాలని , ఎండలు ఎక్కువ కావడంతో ఉదయం ఆరు గంటలకి పని స్థలానికి వచ్చి 11 గంటల వరకు పనిచేసి ఇంటికి వెళ్లాలని సూచించారు. సాయంకాలం తిరిగి పనులకు రావాలని తెలిపారు. పనులు సక్రమంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని ఫీల్డ్ అసిస్టెంట్ ఏ. సుభాష్ ను  ఆదేశించారు. అనంతరం అక్కడి నుండి పెద్దగుల్ల జిపి గ్రామానికి వెళ్లడం జరిగింది. స్థానిక సర్పంచ్ మాధవరావు దేశాయితో కలిసి గ్రామంలోని ఎంపియుపిఎస్ తెలుగు మీడియం హెచ్ఎం చంద్రకళ , ఎంపీయూపీఎస్ ఉర్దూ మీడియం హెచ్ఎం  సమీనా బేగం విద్యార్థుల ఆహారపు అలవాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా విద్యార్థుల ఆరోగ్య విషయాలను ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించాలని అంగన్వాడి టీచర్ మరియు ఉర్దూ మరియు తెలుగు మీడియం ఉపాధ్యాయులకు సూచించారు. మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు అందిస్తున్న పోషక విలువలు కలిగిన ఆహారం అందిస్తున్నారా అని ఏజెన్సీ నిర్వాహకులకు అడిగారు. అనంతరం అంగన్వాడి కేంద్రానికి వెళ్లి పౌష్టికార విషయాలను మరియు రికార్డులను పరిశీలించారు. పిల్లల సంఖ్యను పెంచాలని అంగన్వాడీ టీచర్ కు ఆదేశించారు .నీటి ఎద్దడి నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి వివరాలను ఆర్డబ్ల్యూఎస్ స్థానిక ఏఈ నయుమ్ మరియు గ్రామస్తులకు, సర్పంచ్ కు అడిగి తెలుసుకున్నారు. జెడ్పి సీఈవో చందర్ నాయక్ వెంట ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీ ఓ రాము, పెద్ద ఏడ్గి సర్పంచ్ అనిల్ కుమార్, పెద్ద గుల్లా సర్పంచ్  మాదారావు దేశాయి ,ఆర్ డబ్ల్యూ ఎస్ ఈఈ ,  డి ఈ , ఏఈఈ , ఉపాధి హామీ ఏపీవో తులసి రామ్ , ఈసీ స్వామి దాస్, టి ఏ లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -