నవతెలంగాణ మద్నూర్
గ్రామాల అభివృద్ధికి ప్రజా పాలన ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయంలో ప్రత్యేకంగా కృషి జరుగుతుందని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు తెలిపారు మంగళవారం నాడు మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు శంకుస్థాపనలు చేశారు. మేనూర్ గ్రామంలో రూ.30 లక్షల వ్యయంతో సి.సి రోడ్డు నిర్మాణ పనులకు, అదేవిధంగా మరో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న సొసైటీ గోదాం నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు.గ్రామ అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు ముందుకు వేయడంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేనూర్ హనుమాన్ మందిర చైర్మన్ విట్రల్ గురూజీ టెంపుల్ ధర్మకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా ఎమ్మెల్యేకు గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ ఆ గ్రామ పెద్దలు హనుమాన్ టెంపుల్ చైర్మన్ విట్టల్ గురూజీ శాలువతో ఘనంగా సత్కరించారు.



