Wednesday, April 8, 2026
E-PAPER
Homeజిల్లాలువిద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి… చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి… చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

- Advertisement -
  • ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా చందన స్కూల్‌లో దంత వైద్య శిబిరం

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్‌ పట్టణంలోని చందన స్కూల్‌లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. దంత పరీక్షలు నిర్వహించి చికిత్స శిబిరం నిర్వహించారు.ఈ శిబిరాన్ని చౌటుప్పల్ పురపాలక చైర్‌పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ ప్రారంభించారు.స్కూల్ ప్రిన్సిపాల్ అవ్వారి రామేశ్వరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దంత వైద్యుడు డా.పాశం శివకుమార్ విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్సలు అందించారు.ఈ సందర్భంగా పురపాలక సభ్యుడు పాక చిరంజీవి మాట్లాడారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న పురపాలక చైర్‌పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం అత్యంత ముఖ్యమని,చిన్న వయస్సులోనే మంచి ఆరోగ్య అలవాట్లు అలవరచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.ఇలాంటి ఆరోగ్య శిబిరాలు మరింతగా నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.దంత ఆరోగ్యం సహా జ్ఞానేంద్రియాల సంరక్షణ కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో విశ్రాంత అధ్యాపకుడు నాగభూషణం రిటైర్డ్ సామాజిక ఆరోగ్య అధికారి బడుగు శ్రీరాములు పూర్వ ఎంపీటీసీ శంకర్ గౌడ్ స్కూల్ డైరెక్టర్ అవ్వారు గోవర్ధన్ తదితరులు వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం కె.స్వప్న,పద్మ,అర్చన,గీత,జగదీశ్వరి,స్వప్న,లావణ్య,దీప,తేజ,ఉష,సంధ్యారాణి కాలనీవాసులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -