-జిఎంపియస్ రాష్ట్ర కార్యదర్శి…ఉడుత రవీందర్…
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : గత అసెంబ్లీ ఎన్నికల మెనిపెస్టోలో గొల్ల కుర్మలకు100 రోజుల్లో ఇస్తామన్న రెండు లక్షల రూపాయల నగదు బదిలీ హామీని వెంటనే ప్రారంభించాలని గొర్రెల,మేకల పెంపందార్ల సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం జి ఎం పి ఎస్ యాదాద్రి జిల్లా ఆఫీస్ బేరర్ల సమావేశం భువనగిరి వృత్తిదారుల కార్యాలయంలో మద్దెపురం రాజు అధ్యక్షతన నిర్వహించగా, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. గత ప్రభుత్వం 2017లో ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకంలో రెండవ విడతగా జిల్లాలో 13000 యూనిట్లు రావాల్సి ఉందన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నగదు బదిలీ ద్వారా ప్రతి ఒక్కరికి రెండు లక్షల రూపాయల చొప్పున జమ చేస్తామని హామీ ఇచ్చి రెండున్నర సంవత్సరాలు దాటినా అమలు చేయలేదని విమర్శించారు.వరుసగా ప్రభుత్వాలు గొల్ల కురుమలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి తప్ప హామీల అమలులో చిత్తశుద్ధి లేదన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకంలో ₹700 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందనే సాకుతో రెండున్నర సంవత్సరాల కాలంగా గొర్రెలు పంపిణీ నిలిపివేసిందని అన్నారు.అవినీతిపై విచారణ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.గొర్రెల మేకల పెంపకందారులు అనేక సంవత్సరాలు జిఎంపియస్ ఆధ్వర్యంలో పోరాడి సాధించుకున్న 559,1016,64 జీవోలను పటిష్టంగా అమలు చేయాలని,జిల్లా పశుసంవర్ధక శాఖలో ఉన్న ఖాళీగా 42 పోస్టులు వెంటనే భర్తీ చేయాలని,ఇప్పటికే ఉన్న వెటర్నరీ డాక్టర్లు గొర్రెల కాపరులకు అందుబాటులో ఉండాలని,పశు వైద్యశాలల్లో అమ్మతల్లి,చిటుక రోగానికి టీకాలు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.గొర్రెల కాపరుల సమస్యల పరిష్కారం కోసం గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం కృషి చేస్తుందని తెలిపారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలలో తమ వాటా కోసం గొల్ల కుర్మలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు బండారు నర్సింహ్మ,ప్రధాన కార్యదర్శి దయ్యాల నర్సింహ్మ,ఉపాధ్యక్షులు బుడుమ శ్రీశైలం,సహాయ కార్యదర్శులు కొండె శ్రీశైలం,ఎల్లంల సత్యనారాయణ,నారి వెంకటేశం పాల్గొన్నారు
గొల్ల కుర్మలకు నగదు బదిలీ వెంటనే ప్రారంభించాలి…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



