Tuesday, April 7, 2026
E-PAPER
Homeజిల్లాలుక్ర‌మశిక్షణతో పెరిగిన విద్యార్థులే భవిష్యత్తులో స్థిరపడుతారు

క్ర‌మశిక్షణతో పెరిగిన విద్యార్థులే భవిష్యత్తులో స్థిరపడుతారు

- Advertisement -
  • కరస్పాండెంట్ జోసెఫ్
    నవతెలంగాణ-మిడ్జిల్: ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను విద్యార్థులు క్రమశిక్షణతో విద్య నేర్చుకున్న విద్యార్థులే భవిష్యత్తులో స్థిరపడతారని, విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందిస్తారని కరస్పాండెంట్ జోసెఫ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని సెంట్ మేరీ హై స్కూల్ పదవ తరగతి విద్యార్థులకు వీడ్కలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జోసెఫ్ మాట్లాడుతూ, పదవ తరగతిలో మంచి మార్కులు సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఒకే పాఠశాలలో చదువుకొని ఈరోజు పాఠశాల విడిచి పోతుంటే బాధగా ఉందని చెప్పారు. ఉపాధ్యాయులు విద్యార్థులను దండించారంటే వారి భవిష్యత్తు కోసమే తప్ప వ్యక్తిగతం ఉండదని విద్యార్థులు గ్రహించాలని సూచించారు. విద్యార్థులు పదో తరగతిలో వందకు వందశాతం పాస్ అయితే తల్లిదండ్రులకు,పాఠశాలకు ఉపాధ్యాయులకు, గ్రామానికి పేరు ప్రతిష్టలు వస్తాయని అన్నారు. విద్యార్థుల చదువు కోసం తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారని వారి కష్టాన్ని వృధా చేయకుండా కష్టంతో అనుకోకుండా ఇష్టపడి చదివి తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. అనంతరం సంస్కృతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్డైసన్, జోసెఫ్, లింగం, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -