Tuesday, April 7, 2026
E-PAPER
Homeజిల్లాలుమీ సేవ నిర్వాహకుల ఆత్మీయ సమ్మేళనం

మీ సేవ నిర్వాహకుల ఆత్మీయ సమ్మేళనం

- Advertisement -

నవతెలంగాణ-చిన్నకోడూరు: సిద్దిపేట జిల్లా కేంద్రంలో మీసేవ నిర్వాహకులు మంగళవారం నిర్వహించిన ‘ఆత్మీయ సమ్మేళనం’ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా మేనేజర్ కమటం ఆనంద్ కుమార్, టీజీటీఎస్ జిల్లా మేనేజర్ మారాఠి నరేష్ హాజరై మాట్లాడుతూ మీసేవ నిర్వాహకుల కోసం వెంటనే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. గ్రూప్-4 ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఇంటర్నెట్ లోపాల వల్ల జరిగే తప్పులకు నిర్వాహకులను బాధ్యులను చేయడం సరికాదన్నారు. పెరిగిన కమీషన్‌తో నిర్వాహకులకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని, ప్రజలకు మరింత పారదర్శకంగా, మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలువురు మీసేవ ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -