నవతెలంగాణ హైదరాబాద్: రాజకీయ కోణంలోనే తన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అనుమతి నిరాకరణ నేపథ్యంలో అమెరికాలోని బోస్టన్‌కు వెళ్లలేకపోతున్నట్టు చెప్పారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు.
రాజకీయ కారణాల రీత్యా తన అమెరికా పర్యటనకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ (MEA) అనుమతి నిరాకరించిందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని బోస్టన్‌కు వెళ్లలేకపోతున్నా అని ఆయన ‘ఎక్స్’లో తెలిపారు. తన విదేశీ పర్యటన అంశంలో మద్దతుగా నిలిచిన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ”లండన్ పర్యటనను విజయవంతంగా ముగించుకున్నాను. మరికొన్ని గంటల్లో హైదరాబాద్‌కు వస్తున్నా. అక్కడికి వచ్చాక మిగిలిన అంశాలపై మాట్లాడతా. గత మూడు రోజులుగా పార్టీ, నేతలు, ప్రజల నుంచి లభించిన అద్భుతమైన మద్దతుకు కృతజ్ఞతలు“ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.



