- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా సంస్థ ఆర్థిక నష్టాలు, భద్రతా లోపాలతో సతమతమవుతుండగా, సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ తన పదవికి రాజీనామా చేశారు. 2027 వరకు పదవీకాలం ఉన్నప్పటికీ, ఏడాదిన్నర ముందుగానే ఆయన తప్పుకోవడం కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 2026 ఆర్థిక సంవత్సరంలో ₹2,000 కోట్లుగా అంచనా వేసిన నష్టం, ప్రస్తుతం ₹20,000 కోట్లకు చేరే అవకాశం ఉంది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు, సేవలపై విమర్శలు కూడా సంస్థను దెబ్బతీస్తున్నాయి. విల్సన్ నిష్క్రమణతో, కొత్త సారథి సంస్థను ఎలా గట్టెక్కిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
- Advertisement -



