Wednesday, April 8, 2026
E-PAPER
HomeNewsతాత్కాలిక విరామమే: మొజ్తబా ఖమేనీ

తాత్కాలిక విరామమే: మొజ్తబా ఖమేనీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికా, ఇరాన్ మధ్య గత 39 రోజులుగా కొనసాగుతున్న భీకర యుద్ధానికి తాత్కాలికంగా తెరపడింది. రెండు వారాల పాటు కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ మేరకు తమ సైనిక విభాగాలన్నీ కాల్పులు నిలిపివేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఇది యుద్ధం ముగింపు కాదని, చర్చల కోసం ఇస్తున్న తాత్కాలిక విరామం మాత్రమేనని టెహ్రాన్ స్పష్టం చేసింది. కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ, తమ చేతులు ట్రిగ్గర్‌పైనే ఉన్నాయని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ హెచ్చరించింది. “శత్రువు చిన్న తప్పు చేసినా పూర్తి శక్తితో ప్రతిస్పందిస్తాం” అని ఒక ప్రకటనలో పేర్కొంది.
ఫిబ్రవరి 28న యూఎస్-ఇజ్రాయెల్ జరిపిన దాడిలో అప్పటి సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించడంతో ఈ యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. యుద్ధ లక్ష్యాలను దాదాపుగా సాధించామని, శత్రువును చారిత్రక ఓటమి అంచున నిలబెట్టామని ఇరాన్ ప్రకటించింది. చర్చల కోసం ఇరాన్ 10 సూత్రాలతో కూడిన ప్రతిపాదనను అమెరికా ముందుంచింది. హర్మూజ్ జలసంధిపై తమ ఆధిపత్యం, ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాల నుంచి బలగాల ఉపసంహరణ, తమకు జరిగిన నష్టానికి పూర్తి పరిహారం చెల్లించడం, అన్ని ఆంక్షలను ఎత్తివేయడం వంటివి ఈ ప్రతిపాదనలోని కీలక అంశాలు. ఈ నెల 10న పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఇరు దేశాల మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -