- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. బేగంపేట ఏవికన్స్ పైలెట్ శిక్షణ సంస్థలో పైలెట్ కోర్సు నేర్చుకుంటున్న యువతిపై అదే సంస్థలో ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్న నసిముద్దీన్ లైంగికదాడికి పాల్పడ్డాడు. జనవరి 2025 నుంచి శిక్షణ పేరుతో పలుమార్లు లైంగికదాడి చేసి, ఫోటోలు, వీడియోలు తీసి బెదిరించినట్లు బాధితురాలు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలో దమ్మాయిగూడకు చెందిన మరో ఇన్‌స్ట్రక్టర్ సల్మాన్ కూడా సహకరించినట్లు తెలుస్తోంది. పోలీసులు నసిముద్దీన్‌ను అరెస్ట్ చేసి, సల్మాన్ పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



