- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో టోలిచౌకిలోని నైస్ జ్యూస్ సెంటర్ లో పనిచేస్తున్న మోఫిల్ (19) అనే యువకుడు, దుర్వేశ్ (16) అనే మరో యువకుడిని గరిటెతో కొట్టి హత్య చేశాడు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఘటనలో, చిన్న విషయమై గొడవపడటంతో మోఫిల్ ఆగ్రహంతో దుర్వేశ్ తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బీహార్ రాష్ట్రానికి చెందిన వీరిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



