Wednesday, April 8, 2026
E-PAPER
Homeజాతీయంప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వానికి ఈసీ అల్టిమేటం

ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వానికి ఈసీ అల్టిమేటం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: కేంద్ర ఎన్నిక‌ల సంఘం(Election Commission of India) ఇవాళ ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. ఈసారి బెంగాల్‌లో ఎన్నిక‌లు స్వేచ్ఛ‌గా, నిర్భ‌యంగా జ‌రుగుతాయ‌ని పేర్కొన్న‌ది. ఈసీ ఇవాళ త‌న ఎక్స్ అకౌంట్‌లో ఓ ట్వీట్ పోస్టు చేసింది. హింస లేకుండా, బెదిరింపులు లేకుండా, త‌నిఖీలు లేకుండా, పోలింగ్ బూత్‌ల్లో జామ్ లేకుండా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ జ‌ర‌గ‌నున్న‌ట్లు ఈసీ పేర్కొన్న‌ది. ఇక ఆ రాష్ట్రానికి చెందిన తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఈసీ గ‌ట్టి వార్నింగ్ ఇచ్చింది. టీఎంసీకి సూటిగా హెచ్చ‌రిక చేస్తున్న‌ట్లు త‌న ట్వీట్‌లో ఈసీ చెప్పింది. క‌చ్చితంగా ఈసారి బెంగాల్‌లో ఎన్నిక‌లు నిర్భ‌యంగా, స్వేచ్ఛ‌గా జ‌రుగుతాయ‌ని పేర్కొన్న‌ది.

అదే విధంగా బెంగాల్‌లో నేడు తృణమూల్‌ కాంగ్రెస్‌ బృందం-ఎన్నికల సంఘం మధ్య జరిగిన సమావేశం (EC-TMC meet)లో రసాభాస నెలకొంది. ఏడు నిమిషాల పాటు జరిగిన సమావేశం అనంతరం ఇరు వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -