Wednesday, April 8, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్‌కు ఆయుధాలు స‌ప్ల‌య్ చేసే దేశాల‌పై 50శాతం సుంకాలు: ట్రంప్

ఇరాన్‌కు ఆయుధాలు స‌ప్ల‌య్ చేసే దేశాల‌పై 50శాతం సుంకాలు: ట్రంప్

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: ప‌శ్చిమాసియా యుద్ధానికి ట్రంప్ రెండు వారాల‌ కాల్పుల విర‌మ‌ణ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈక్ర‌మంలోనే మ‌రోసారి టారిప్‌ల యుద్ధానికి అమెరికా అధ్య‌క్షుడు తెర‌లేపారు. ఇరాన్‌కు ఆయుధాలు స‌ప్ల‌య్ చేసే దేశాల‌పై 50శాతం సుంకాలు విధిస్తాన‌ని ట్రూత్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించారు. ఈ నిర్ణ‌యం త‌క్ష‌ణ‌మే అమ‌లోకి వ‌స్తుంద‌ని, ఎలాంటి మిన‌హాయింపులు ఉండ‌వ‌ని చెప్పారు.

“ఇరాన్‌కు సైనిక ఆయుధాలను సరఫరా చేసే దేశం, అమెరికాకు విక్రయించే అన్ని వస్తువులపై తక్షణమే 50% సుంకాన్ని విధిస్తాం. దీనికి ఎలాంటి మినహాయింపులు లేదా సడలింపులు ఉండవు!” అని ఆయన పోస్ట్‌లో పేర్కొన్నారు. అలాగే ఇరాన్‌పై సుంకాలు మరియు ఆంక్షల ఉపశమనంపై చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ ఇంతకుముందు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -