Wednesday, April 8, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంలెబనాన్‌పై కొన‌సాగుతున్న‌ ఇజ్రాయిల్ దాడులు

లెబనాన్‌పై కొన‌సాగుతున్న‌ ఇజ్రాయిల్ దాడులు

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడులు కొన‌సాగుతున్నాయి. టైర్ సిటీలో హిజ్బుల్లా కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. అందుకే ఈ దాడులు చేసినట్లు తెలిపింది. లెబనాన్పై యుద్ధం కొనసాగుతుందని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. రెండు వారాల అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా.. లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా బుధవారం ఉత్తర ఇజ్రాయెల్‌ పైనా, లెబనాన్‌లోని ఇజ్రాయెల్ సైనికుల పైనా దాడులను నిలిపివేసింది. అయితే.. ఇజ్రాయెల్ కూడా ఈ కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలని.. లేకపోతే ప్రతిదాడులు తప్పవని హిజ్బుల్లా హెచ్చరించింది.

దక్షిణ లెబనాన్‌లోని సామాన్య ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆయన మరోసారి ఇజ్రాయెల్ ఆదేశాలను గుర్తుచేశారు. దక్షిణ లెబనాన్ అంతటా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. దక్షిణ లెబనాన్ లోని ఒక హాస్పిటల్ కు దగ్గరలో ఒక బిల్డింగ్ పై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడిలో నలుగురు మరణించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -