- Advertisement -
నవతెలంగాణ-సత్తుపల్లి
సోమవారం హైదరాబాదులో జరిగిన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ కుమార్తె అతిధి నిశ్చయ తాంబూలాల వేడుకలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. హైదరాబాద్ కొండాపూర్లోని మాయా కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన ఈ శుభకార్యానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకలో పాల్గొన్న మంత్రి, కాబోయే నూతన వధూవరులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రముఖులు పాల్గొని కాబోయే నూతన జంటకు శుభాకాంక్షలు అందించారు.
- Advertisement -



