- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా మినీ ఎన్నికల సమరం నడుస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ మూడు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అస్సాం, కేరళం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓటింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎండ కాలం కారణంగా ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు ప్రజలు తరలివచ్చారు. పెద్ద వయసు గల వారు బూత్‌లకు తరలివచ్చారు. ఇక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు.
అసోంలో 126 స్థానాలకు 722 మంది పోటీ చేస్తున్నారు. కేరళంలో 140 స్థానాల్లో 883 అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. పుదుచ్చేరిలో 30 స్థానాలకు గాను 294 మంది అభ్యర్థులు ఉన్నారు.
- Advertisement -



