నవతెలంగాణ–అశ్వారావుపేట
మండలంలోని ఉట్లపల్లి గ్రామ పంచాయతీ లో మంగళవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.అటవీ శాఖ అధికారులు ,ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, స్థానికుల భాగస్వామ్యంతో కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకంపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రీన్ ఇండియా లక్ష్య సాధనలో భాగంగా గ్రామస్థులు మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్రతిజ్ఞ చేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. నాటిన ప్రతి మొక్క భవిష్యత్ తరాలకు ప్రాణవాయువును అందించే జీవనదాత అని పేర్కొన్నారు. మొక్కలను పొత్తిళ్లలో పెట్టుకుని కాపాడుకున్నంత అపురూపంగా సంరక్షించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఎస్.లక్ష్మీకుమారి,ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్ర రావు,ఎంపీఓ రామ కోటా రెడ్డి, కౌన్సిలర్ లు మిండ హరిబాబు, నార్లపాటి దివాకర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిన్నంశెట్టి సత్యనారాయణ, కోలా లక్ష్మీనారాయణ, కాసాని పద్మశేఖర్తో పాటు అటవీ శాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



