Thursday, April 9, 2026
E-PAPER
Homeజాతీయంమూడు రాష్ట్రాల్లో పెరిగిన పోలింగ్

మూడు రాష్ట్రాల్లో పెరిగిన పోలింగ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ఊపుందుకుంది. గురువారం ఒంటి గంటకు అస్సాంలో 59.63శాతం, కేరళలో 49.70 శాతం ఓటింగ్ నమోదైంది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 56.83 శాతం ఓటింగ్ నమోదైంది. ఇవాళ అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓటింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అసోంలో 126 స్థానాలకు 722 మంది పోటీ చేస్తున్నారు. కేరళలో 140 స్థానాల్లో 883 అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. పుదుచ్చేరిలో 30 స్థానాలకు గాను 294 మంది అభ్యర్థులు ఉన్నారు.

అదే విధంగా తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు, పశ్చిమ బెంగాల్‌లోని 152 స్థానాలకు మొదటి విడత పోలింగ్ ఏప్రిల్ 23న జరగనుంది. ఇక పశ్చిమ బెంగాల్‌లో 142 స్థానాలకు రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది. నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న విడుదలకానున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -