Thursday, April 9, 2026
E-PAPER
Homeజిల్లాలురెండో రోజు ఆర్టిజన్ కార్మికుల సమ్మె

రెండో రోజు ఆర్టిజన్ కార్మికుల సమ్మె

- Advertisement -

నవతెలంగాణ-చౌటుప్పల్‌రూరల్: తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీవిజాక్) పిలుపు మేరకు చౌటుప్పల్‌లో ఆర్టిజన్ కార్మికుల సమ్మె గురువారం రెండో రోజుకు చేరుకుంది. యాజమాన్యం నుంచి ఇప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో కార్మికుల్లో ఆందోళన నెలకొంది. కార్మికుల గైర్హాజరీతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయానికి గురవుతోంది. నిర్వహణ పనులు దెబ్బతినడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వినియోగదారులు, కార్మికులు కోరుతున్నారు.సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -