Thursday, April 9, 2026
E-PAPER
Homeజిల్లాలుభూ భారతి పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

భూ భారతి పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

- Advertisement -
  • జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశం
    నవతెలంగాణ-వనపర్తి: జిల్లాలో భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని ఎన్ఐసి హాల్లో జిల్లా కలెక్టర్ భూభారతి పెండింగ్ అప్లికేషన్లు సహ సాదాభైనామ అప్లికేషన్ల అంశంపై అన్ని మండలాలు తహసిల్దార్లు ఇతర రెవెన్యూ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. భూభారతి పెండింగ్ ఫైల్స్ ను కలెక్టర్ లాగిన్‌కు పంపడంతో పాటు వాటి యొక్క ఫిజికల్ ఫైల్స్ కూడా పంపాలని సూచించారు. అలాగే సాదా బైనామా దరఖాస్తులను జీఓ 76, 77 ప్రకారం నిబంధనల మేరకు పరిష్కరించాలని ఆయన తెలిపారు. ప్రభుత్వ భూములకు సంబంధించి అన్ని మండలాల్లో తహసిల్దార్ ల వద్ద ప్రత్యేకంగా జాబితా సిద్ధం చేసి ఉంచుకోవాలని చెప్పారు.

అదేవిధంగా త్వరలో ప్రారంభం కానున్న జనగణన ప్రక్రియలో భాగంగా తహసీల్దార్లు తమ సీఎంఎంఎస్ లాగిన్‌లో హెచ్‌ఎల్‌బిలను (హౌస్ లిస్టింగ్ బ్లాక్) క్రియేట్ చేయడం మొదలుపెట్టాలన్నారు. చిన్న గ్రామాలను గుర్తించి వాటిని త్వరగా హెచ్‌ఎల్‌బిలు క్రియేట్ చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, అన్ని మండలాల తహసిల్దార్లు ఇతర రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -