Thursday, April 9, 2026
E-PAPER
Homeజిల్లాలుగురుకుల ఫ‌లితాల్లో మెరిసిన దేపాక అన‌న్య‌

గురుకుల ఫ‌లితాల్లో మెరిసిన దేపాక అన‌న్య‌

- Advertisement -

నవతెలంగాణ-కన్నాయిగూడెం: తెలంగాణ గురుకుల సెట్-2026 ప్ర‌వేశ ప‌రీక్ష‌లో ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని దేపాక అనన్య ప్ర‌తిభ క‌న‌బ‌ర్చింది. 6వ తరగతిలో ప్ర‌వేశానికిగాను బ్యాక్ లాగ్ సీట్ల పరీక్ష ఫలితాల్లో “TSWRS” హనుమకొండ సోషల్ వెల్ఫేర్‌కు ఎంపికైంది. ఈ సంద‌ర్భంగా పాఠ‌శాల ప్రధానోపాధ్యాయురాలు ఎనగందుల స్వర్ణలత, ఉపాద్యాయులు సారంగపాణి శాలువాతో విద్యార్థిని సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గురుకులాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న వసతులు,ఉత్తమమైన విద్యను వినియోగించుకొని ఎన్నో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సారంగపాణి, అంగన్వాడీ టీచర్ పద్మ,నరేంద్ర, పాపమ్మ,అమ్మ ఆదర్శ పాఠశాల సభ్యులు,తల్లిదండ్రులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -