నవతెలంగాణ-జన్నారం: జన్నారం మండలం ఫారెస్ట్ ఆఫీసర్లను బాదం పెళ్లి గ్రామ శివారులో గ్రామస్తులతో పాటు ట్రాక్టర్ యజమానులు అడ్డుకున్నారు. గోదావరి నుండి ఇసుకను తీయకుండా ఇబ్బందుల కలిగిస్తున్నారని, ఇసుక లేకుంటే ఇళ్ల నిర్మాణలు ఎలా జరుగుతాయని ఫారెస్ట్ ఆఫీసర్లను నిలదీశారు. ఎఫ్డిఓ శివ్, ఆసీస్ సింగ్ డి ఎఫ్ ఓ రామ్మోహన్ మాట్లాడుతూ.. టైగర్ జోన్ పరిధిలో ఎక్కడి నుంచి కూడా ఇసుక తీయడానికి వీలు లేదన్నారు. ఇసుక కావలసినవారు కాలేశ్వరం ఇతర రీచుల వద్దనే కొనుగోలు చేయాలని సూచించారు. ఇసుకను అతి తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటుతాయన్నారు. దీంతో ప్రకృతి వినాశనం అవుతుందన్నారు. కాగా గ్రామస్తులు బాదం పెళ్లిలోనే ఇసుక రీచ్ ఏర్పాటు చేయాలని కోరారు. అధికారులతో దృష్టికి తీసుకెళ్తామని అటవీ అధికారులు తెలిపారు.
ఫారెస్ట్ ఆఫీసర్లను అడ్డుకున్న బాదంపల్లి గ్రామస్తులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



