- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: దేశవ్యాప్తంగా నేటి నుంచి జాతీయ రహదారులపై టోల్ చెల్లింపుల్లో కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను NHAI పూర్తిగా నిలిపివేసింది. ఇకపై వాహనదారులు ఖచ్చితంగా FASTag లేదా UPI ద్వారానే టోల్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పుతో పాటు టోల్ ఛార్జీలు సగటున 10% వరకు పెరిగాయి. ఎక్స్‌ప్రెస్‌వేల్లో 1.5% నుంచి 3.5% వరకు పెంపు జరిగింది. వార్షిక టోల్ పాస్ ధరను రూ.3,075గా నిర్ణయించారు. వాహనదారులు ఇది గమనించాలి.
- Advertisement -



