- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కుంభమేళాలో పూసలు అమ్ముతూ ఓవర్‌నైట్‌లో స్టార్ అయిపోయిన మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ పెళ్లి కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ఎన్‌సీఎస్టీ) విచారణలో మోనాలిసా మైనర్ అని తేలింది. పెళ్లి నాటికి మోనాలిసా వయసు 16 ఏళ్ల 2 నెలలే అని గుర్తించింది. దాంతో మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్ పోలీస్ స్టేషన్‌లో ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు నమోదైంది. కాగా, మోనాలిసా ఇటీవల తిరువనంతపురంలో తన ఫేస్‌బుక్ ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచారు.
- Advertisement -



