నక్క తోక ఫిలిమ్స్ బ్యానర్ పై జైవర్ధన్ మేడి దర్శకత్వంలో యోగేంద్ర ప్రసాద్ పొట్లూరి, రాణి మాడిసన్ నిర్మిస్తున్న ఏఐ చిత్రం ‘అంబా’స్ రివెంజ్’. ఏఐ టెక్నాలజీ ద్వారా రూపొందిన ఈ విజువల్ ఫీస్ట్ చిత్రం భారత దేశపు ఇతిహాసాలలో ప్రత్యేక గుర్తింపు పొందిన మహాభారతంలోని అంబ ప్రతీకారం నుండి తీసుకోబడింది. మహాభారతంలో భీష్ముని వల్ల ఒక జన్మలో మరణిం చిన కారణం, మరో జన్మలో భీష్ముని పై ఆమె పగ తీర్చుకున్న ప్రయాణాన్ని చూపించే దిశగా ఈ చిత్రం ఉంటుంది. మనుషులు ఎవరు నటించ కుండా కేవలం ఏఐ ద్వారా రూపొందించిన ఈ చిత్ర టీజర్ బుధవారం మీడియా సమక్షంలో విడుదల జరిగింది. విజువల్ డైరెక్టర్ సాయి నేత మాట్లాడుతూ,‘ ప్రేక్షకులు అందరూ మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘మహాభారతంలోని ఒక అంశాన్ని తీసుకుని సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానున్నాం’ అని సంగీత దర్శకుడు ప్రమోద్ ఎంసి చెప్పారు. డైలాగ్స్- లిరిక్స్ రచయిత కిషోర్ కుమార్ ఏనుగు మాట్లాడుతూ,‘నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ సినిమాలో 2 పాటలు ఉంటాయి. నేటి తరానికి అర్థం అయ్యేలా ఈ చిత్రాన్ని రూపొందించాం’ అని తెలిపారు. ‘ప్రస్తుతం వస్తున్న కొన్ని ఏఐ రీల్స్ వల్ల ప్రేక్షకులకు ఏఐ సినిమా అంటే ఒక అవగాహన ఉంది.
ఈ సినిమా ప్రేక్షకులకు ఓ మంచి మంచి విజువల్ ఫీస్ట్ అవుతుంది’ అని ఎడిటర్ హ్యారీ బ్రెయిన్ చెప్పారు. నిర్మాత యోగేంద్ర ప్రసాద్ పొట్లూరి మాట్లా డుతూ,‘ఏఐలో సినిమా చేయడం చాలా ఖర్చుతో కూడిన విషయం. అయినప్పటికీ టీమ్ అందరం ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాం. ఈ మావీ చాలా అద్భుతంగా ఉంటుంది’ అని అన్నారు. ‘సినిమా నేపథ్యంలో అంబ అయినప్పటికీ ఈ సినిమాని శిఖండి నుండి చూడబోతున్నాం. సినిమా లో ప్రముఖ పాత్రలు ప్రేక్షకులకు పరిచయం చేయడం కోసం ఈ టీజర్ విడుదల చేయడం జరిగింది. టీజర్ లో డైలాగ్స్ కూడా లేవు, త్వరలో ట్రైలర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాం’ అని దర్శకుడు జైవర్ధన్ మేడి చెప్పారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం – జైవర్ధన్ మేడి , నిర్మాత – యోగేంద్ర ప్రసాద్ పొట్లూరి, రాణి మాడిసన్, ఎడిటింగ్, డిఐ – హ్యారీ బ్రెయిన్, సంగీత దర్శకుడు – ప్రమోద్ ఎంసి.
అంబ ప్రతీకారం నేపథ్యంలో..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



