నవతెలంగాణ – హైదరాబాద్: అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు. తనపై అభిశంసన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. ఈ లేఖ కాపీని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌కు కూడా పంపినట్లు తెలిసింది. గతేడాది మార్చి 14న జస్టిస్ వర్మ ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఆయన అధికారిక నివాసంలోని ఔట్‌హౌస్‌లో కాలిపోయిన నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణలతో ఆయన తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీని ఫలితంగా 2025 జులైలో లోక్‌సభలో 145 మంది, రాజ్యసభలో 63 మంది ఎంపీలు ఆయనపై అభిశంసన తీర్మానానికి నోటీసులు ఇచ్చారు.
జస్టిస్ యశ్వంత్ వర్మ పదవికి రాజీనామా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



