నవతెలంగాణ – హైదరాబాద్: భారతదేశపు దిగ్గజ ప్రైవేట్ జీవిత బీమా సంస్థల్లో ఒకటైన ఎస్బీఐ లైఫ్ తమ 25 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ప్రజలకు సాధికారత కల్పించడాన్ని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించే తమ ‘థాంక్స్ ఏ డాట్’ ఇంటరాక్టివ్ సెషన్లను హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని యూనివర్సిటీ ఆఫ్ సైన్స్‌లో నిర్వహించింది. బ్రెస్ట్ హెల్త్ అనేది సర్వసాధారణంగా చర్చించుకోతగిన విషయమనే అవగాహనను పెంపొందించేందుకు అలాగే నివారణ చర్యల గురించి చర్చించుకునేలా ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం ఉద్దేశించబడినది.
ఎస్బీఐ లైఫ్ ఇటీవల 70 మందికి పైగా పోస్ట్ గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ విద్యార్థులతో ఉస్మానియా యూనివర్సిటీలోని యూనివర్సిటీ ఆఫ్ సైన్స్‌లో ఇంటరాక్టివ్ అవగాహన సెషన్‌ని నిర్వహించింది. ఎస్బీఐ లైఫ్ చీఫ్ (బ్రాండ్, కార్పొరేట్ కమ్యూనికేషన్ & సీఎస్ఆర్) Mr. రవీంద్ర శర్మతో పాటు అపోలో హైదర్‌గూడ కన్సల్టెంట్ ఆంకో సర్జన్ Dr. సౌమ్య ఇందులో పాల్గొన్నారు. ముందస్తు హెచ్చరిక సంకేతాలు, సమాజంలో ఉన్న అపోహలను తొలగించడం, తమ ఆరోగ్యాన్ని కాపాడుకునే దిశగా తీసుకోవాల్సిన క్రియాశీలకమైన చర్యలు మొదలైన వాటి గురించి విద్యార్థులతో చర్చాగోష్టి నిర్వహించారు. ఆరోగ్యం మరియు సన్నద్ధత విషయాల్లో ఆత్మవిశ్వాసంతో క్రియాశీలకంగా వ్యవహరించేలా విద్యార్థుల్లో ఇది స్ఫూర్తి నింపింది.
ఎస్బీఐ లైఫ్ యొక్క ఫ్లాగ్షిప్ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమమైన థాంక్స్ ఏ డాట్ అనేది ఒక హాట్ వాటర్ బ్యాగ్‌ని ఉపయోగించి, బ్రెస్ట్ హెల్త్, స్వీయ పరీక్ష మరియు సత్వరం వైద్యులను సంప్రదించాల్సిన ఆవశ్యకత గురించి చర్చ జరగాల్సిన అవసరాన్ని తెలియజెప్పేదిగా ఉంటుంది. సంకోచం, న్యూనతను తొలగించేలా ఇది రూపొందించబడింది. బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చర్చను సర్వసాధారణ అంశంగా పరిగణించేలా, యువతకు ప్రాణాలను కాపాడుకునే నైపుణ్యాలను అందించేలా ఈ కార్యక్రమం తీర్చిదిద్దబడింది.
“కాలేజీ విద్యార్థులు, ముఖ్యంగా యువ మహిళలు, దీర్ఘకాలికంగా ప్రభావం చూపే ఆరోగ్యకరమైన అలవాట్లను చేసుకునే దశలో ఉంటారు. బ్రెస్ట్ క్యాన్సర్, స్వీయ పరీక్షల ప్రాధాన్యత, ముందస్తుగా గుర్తించడం అలాగే అలవాట్లపరంగా చిన్న చిన్న మార్పులు ప్రివెంటివ్ కేర్‌లో ఏ విధంగా గణనీయమైన వ్యత్యాసం తీసుకొస్తాయనే విషయాలపై ‘థాంక్స్ ఏ డాట్’ కార్యక్రమం ద్వారా అవగాహన పెంపొందించాలనేది మా లక్ష్యం. ముందస్తుగా అవగాహన పెంపొందించేందుకు, ఆరోగ్యంపరంగా బాధ్యతాయుతమైన విధనాలను ప్రోత్సహించేందుకు, ఇటు ఆరోగ్యం అటు ఆర్థిక నిర్ణయాలపైనా సానుకూల ప్రభావం చూపే అలవాట్లను పెంపొందించడంలో క్యాంపస్‌లు కీలక వేదికలుగా నిలుస్తాయి.
తొలి నాళ్ల నుంచే తమ ఆరోగ్య సంరక్షణ బాధ్యతలను మహిళలు తమ చేతుల్లోకి తీసుకునేలా బ్రెస్ట్ హెల్త్‌పై మరింత విస్తృతంగా చర్చ జరిగే పరిస్థితులను ఈ కార్యక్రమం ద్వారా కల్పించాలనేది మా ఉద్దేశం” అని ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ (బ్రాండ్, కార్పొరేట్ కమ్యూనికేషన్ & సీఎస్ఆర్) Mr. రవీంద్ర శర్మ తెలిపారు.
ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన ఎస్బీఐ లైఫ్ యొక్క థాంక్స్ ఏ డాట్ కార్యక్రమం భారీగా విజయవంతమైంది. ఈ క్రమంలో ఆంకాలజిస్టులు, యూనివర్సిటీ లీడర్లు మరియు విద్యార్థులను రొమ్ము క్యాన్సర్‌పై పోరాటంలో ఏకం చేసింది. Dr. సౌమ్యలాంటి నిపుణులతో ఆకట్టుకునే చర్చలు, ఇంటరాక్టివ్ TAD కిట్ పంపిణీ ద్వారా జీవితాలను కాపాడుకునేలా, ముందస్తు సెల్ఫ్-డిటెక్షన్కి ప్రాధాన్యతనిచ్చేలా మహిళలకు సాధికారత కల్పిస్తున్నాం. ఎస్బీఐ లైఫ్ యొక్క ప్రభావవంతమైన మరియు సామాజిక కార్యక్రమం ఎంతో ప్రశంశనీయం. కీలకమైన అవగాహనను పెంపొందిస్తున్నందుకు గాను హృదయపూర్వక అభినందనలు” అని హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ వైస్ ప్రిన్సిపల్ Dr. ఎం. కవిత తెలిపారు.
అలవాట్లలో మార్పులు తేవడం, ప్రివెంటివ్ ఆరోగ్య విధానాలను ప్రోత్సహించడం, భారతదేశపు యువతలో దీర్ఘకాలికంగా అవగాహనను పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా విద్యా సంస్థల్లో ‘థాంక్స్ ఏ డాట్’ని విస్తరించాలని ఎస్బీఐ లైఫ్ లక్ష్యంగా నిర్దేశించుకుంది.



